Doda Encounter | జమ్మూకశ్మీర్ దోడాలోని అస్సార్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, ఎన్కౌంటర్లో 48 నేషనల్ రైఫిల్స్‌కు చెందిన కెప్టెన్ వీరమరణం పొందారు. సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు ఎం4 రైఫిల్స్‌తో పాటు మందుగుండు సామగ్రి, లాజిస్టిక్స్ మెటీరియల్, మూడుబ్యాగులను సైతం స్వాధీనం చేసుకున్నాయి. దోడా అస్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు.. వారిపైకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో సెర్చ్ టీంకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు.
ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. ప్రాణాలు కోల్పోయారు. ఆయన 48 నేషనల్ రైఫిల్స్ చెందినవారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మొదలుపెట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో బలగాలకు దిశానిర్దేశం చేస్తున్న సమయంలో ముష్కరుల తూటాలకు బలయ్యారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్లో తీవ్ర గాయాలు కాగా.. ఆసుప్రతిలో చేర్పించగా దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అధికారులు పేర్కొన్నారు. అస్సార్‌లోని ఓ నది దగ్గర ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందిందని ఓ అధికారి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రామ్‌నగర్ తహసీల్‌లోని డూడు బసంత్‌గఢ్‌లోని కొండ ప్రాంతంలో నలుగురు ముష్కరులు కనిపించారు.
ఆ తర్వాత బలగాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు సియోజ్ధర్, అస్సర్ మీదుగా దోడాకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సియోజ్ధర్ ప్రాంతంలో కనిపించగా.. పొగమంచులో తప్పించుకున్నారు. ప్రతికూల వాతావరణం కారణం విజిబులిటీ తగ్గింది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా బలగాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత భద్రతా బలగాలు దోడా వైపు భద్రతను కట్టుదిట్టం చేశాయి. గతవారంలోనూ ఉగ్రవాదులు ఇక్కడ తప్పించుపారిపోయారు. ప్రతికూల వాతావరణం ఉగ్రవాదులకు రక్షణకవచంగా మారుతున్నది.
Air India | లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ముంబైకి దారి మళ్లింపు