Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్లో 2025-26కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తి (Gurjada Sukti)ని ప్రస్తావించారు.
‘దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అంటూ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ను రూపకల్పన చేసినట్లు చెప్పారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే తమ స్ఫూర్తి, మార్గదర్శి అని తెలిపారు.
Also Read..
Union Budget | సమ్మిళిత అభివృద్ధి.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్: నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman | వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్.. మరో చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ