Nirmala Sitharaman | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2025-26)కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ లోక్‌సభకు సమర్పించారు. ఆమె బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదో సారి కావడం విశేషం. ఇక పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలే కాదు.. సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ప్రతి ఏటా ఈ ప్రత్యేక సందర్భంలో సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది కూడా అదే తీరును అనుసరించారు. ఈ సారి కూడా నిర్మలమ్మ చీరఎంపికలో తన మార్క్‌ను చూపించారు (signature sarees on Budget Day).
ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు నిర్మలమ్మ. ఇక స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్ సమావేశాలకు ఆమె చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. బంగారు అంచుతో ఉన్న గోధుమరంగు చీర, ఎరుపు బ్లౌజ్‌తో మెరిశారు.
ఆ చీరపై ఓ శాలువాను కూడా వేసుకుని కనిపించారు. ఇక చీర అంచుపై ఉన్న డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర నిర్మలమ్మకు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. బీహార్‌లోని మధుబనికి వెళ్లినప్పుడు ఆ చీరను నిర్మలకు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ చీరను దులారీనే స్వయంగా డిజైన్ చేయడం విశేషం. అంతేకాదు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఈ చీరను ధరించాలని ఆమె నిర్మలమ్మను కోరారు. దీంతో ఆమె కోరిక మేరకే ఆ స్పెషల్ శారీని ఇవాళ ధరించినట్లు తెలిసింది.
ఇక 2019లో తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేస్ స్థానంలో బహీ ఖాతా (ఎర్నటి వస్త్రంతో చుట్టిన సంచీ)తో పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు వర్ణంలో ఉన్న చీరతో సమావేశాలకు హాజరయ్యారు. 2021లో ఎరుపు – గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో మెరిశారు. 2022లో మెరూన్ కలర్ ఒడిశా చేనేత చీరను ధరించారు. రస్ట్ బ్రౌన్, డార్క్ మెరూన్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ నేత బోర్డర్ మరింత ఆకర్ణణీయత తెచ్చింది. ఆ చీరలో ఆమె నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచారు.
Nirmalamma1
2023లో టెంపుల్ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీరలో ఆకట్టుకున్నారు. ఇక గతేడాది అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో టస్సర్ హ్యాండ్లూమ్ బ్లూ, క్రీమ్ కలగలిపిన చేనేత చీరను ఎంచుకున్నారు. ఈ కలర్‌ను ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా ఆమె ఈ చీరను ధరించారు.
ఇక అదే ఏడాది జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నిర్మలమ్మ తెలుపు రంగు (white saree) చీరను ఎంచుకున్నారు. బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చెక్స్ చేనేత చీరలో మెరిశారు. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు సామరస్యానికి భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచికంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.
Also Read..
Budget 2025 | బడ్జెట్ వేళ.. నిర్మలమ్మకు మిఠాయి తినిపించిన రాష్ట్రపతి
Union Budget | బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర