Budget 2025 | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్ (Parliament)లో 2025 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ను కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై బడ్జెట్ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. పెరుగు, చెక్కరతో నోరు తీపి చేసి గుడ్‌లక్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary ‘dahi-cheeni’ (curd and sugar) ahead of her Budget presentation.
Union Finance Minister Nirmala Sitharaman will present her 8th consecutive #UnionBudget, today in Parliament
(Source… pic.twitter.com/jZz2dNh59O
— ANI (@ANI) February 1, 2025
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్‌కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఎనిమితోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకోనున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఆమె సమం చేయనున్నారు.
Also Read..
Union Budget | బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్
Maha Kumbh Mela | భక్తజనసంద్రమైన త్రివేణీ సంగమం.. 50 లక్షల మంది పుణ్యస్నానాలు
Gas Cylinder Price | బడ్జెట్‌కు ముందు గుడ్‌న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర