Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజనసంద్రంగా మారింది. అక్కడ జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటల వరకూ 54లక్షల మంది నదీ స్నానాలు చేసినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.
అందులో 10 లక్షల మందికిపైగా కల్పవాసులు కాగా మిగిలిన వారు యాత్రికులు. ఇక కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకూ 31 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కొనసాగే ఈ కుంభమేళాకు 50 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
#WATCH | Prayagraj | Devotees continue to arrive and take holy dip at Triveni Sangam#MahaKumbh2025 pic.twitter.com/3Zx9fL9RQa
— ANI (@ANI) February 1, 2025
Also Read..
Lingamanthula Jathara | పెద్దగట్టుకు పైసా ఇయ్యలే.. లింగమంతుల జాతరపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యం
Union Budget | బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్
Union Budget | సీతమ్మ కరుణించేనా? పసుపుబోర్డుకు పైసలిచ్చేనా?