Lightning Strikes | దేశవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులే కాదు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిశా (Odisha)లో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు (thunderstorms), మెరుపులు, ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు (Lightning Strikes) తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆరుగురు మహిళలు సహా కనీసం తొమ్మిది మంది మరణించినట్లు (Nine people died) అధికారులు తెలిపారు. కోరాపుట్ జిల్లాలో ముగ్గురు, జాజ్పూర్, గంజాం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, దెంకనల్, గజపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు చెప్పారు. కోరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిడిగూడ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రజలు గాయపడినట్లు వెల్లడించారు.
Also Read..
Helicopter | కేదార్నాథ్ వద్ద ఎయిర్ అంబులెన్స్ క్రాష్ ల్యాండింగ్
ISIS sleeper cells | ముంబై ఎయిర్పోర్ట్లో ఇద్దరు ఐసిస్ సభ్యులు అరెస్ట్
Haryana Student | పాక్కు సున్నితమైన సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్