Haryana Student | పాక్‌కు సున్నితమైన సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్
Haryana Student | భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న హర్యానాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని (Haryana Student) అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
Haryana Student | భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న హర్యానాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని (Haryana Student) అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సదరు విద్యార్థి దేశంలో గూఢచర్యం చేస్తూ, పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు (Shared Key Info With Pakistan) దర్యాప్తులో తేలింది.
హర్యానాలోని మస్త్‌గఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏండ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ (Devendra Singh Dhillon).. పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, అతడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోల్, గన్ చిత్రాలను అప్లోడ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్‌కు చేరవేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అధికారులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గతేడాది నవంబర్‌లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాక్‌కు వెళ్లిన దేవేంద్ర.. పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తేలింది.
ధిల్లాన్‌ను ఆకర్షించేందుకు పాక్ నిఘా అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలను కూడా పాక్ అధికారులతో పంచుకున్నట్లు కైతాల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆస్తా మోదీ తెలిపారు. విద్యార్థి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపారు. అంతేకాదు, పాక్ అధికారులు, విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను తెలుసుకునేందుకు అతని బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.
Also Read..
Congress | కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా.. శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం
Gaza | ఒక్కరోజులోనే 115 మంది మృతి.. 53 వేలు దాటిన గాజా మృతుల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

