Gaza | ఒక్కరోజులోనే 115 మంది మృతి.. 53 వేలు దాటిన గాజా మృతుల సంఖ్య
Gaza | గాజా (Gaza )లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది.
Gaza | గాజా (Gaza )లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గత మూడు రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఏకంగా 115 మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోయారు.
గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు బాంబుల వర్షం కురుస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో 115 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ మినహా గల్ఫ్ దేశాలలో జరిపిన పర్యటన ముగిసిన నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. గాజా స్ట్రిప్ సరిహద్దులపై ఇజ్రాయెల్ దిగ్బంధం మూడు నెలలుగా సాగుతోంది.
ఇక దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధ-గురువారాల మధ్య రాత్రి ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 54 మంది మరణించారు. మృతుల్లో ఓ పాత్రికేయుని కుటుంబ సభ్యుల్లో 11 మంది కూడా ఉన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మధ్య జరిగిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా గత మూడు రోజుల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మరో 115 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపితే గాజా పోరు మొదలైనప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియుల సంఖ్య 53 వేలు దాటినట్లు గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. లక్షలాది మంది గాయపడ్డారు.
Also Read..
Cyber Crime | రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించారు.. రూ.1.60 లక్షలు కాజేశారు
Traffic Diversions | హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5 తర్వాత ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

