Shashi Tharoor | భారత్- పాక్ ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ (Shashi Tharoor) ప్రశంసించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి ప్రధాని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. ఆయన వ్యాఖ్యలతో సొంత పార్టీలోనే శశిథరూర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమైంది. ఒకానొక సమయంలో థరూర్ బీజేపీలో చేరుతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శశి థరూర్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్‌తో భారత్ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్ అరాచకాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాన్ని పంపనుంది. ఇందుకోసం ఏడుగురు వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు కూడా కేంద్రం చోటు కల్పించింది. వీరంతా ఈ నెల చివరల్లో యూఎన్ భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామ్య దేశాలను సందర్శించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది.
ఏడుగురు ప్రతినిధుల బృందం ఇదే..
1) శశి థరూర్, కాంగ్రెస్
2) రవిశంకర్ ప్రసాద్, బీజేపీ
3) సంజయ్ కుమార్ ఝా, జేడీయూ
4) బైజయంత్ పాండా, బీజేపీ
5) కనిమోళి కరుణానిధి, డీఎంకే
6) సుప్రియా సులే, ఎన్సీపీ
7) శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, శివసేన
In the context of Operation Sindoor and India’s continued fight against cross-border terrorism, seven All-Party Delegations are set to visit key partner countries, including members of the UN Security Council later this month. The following Members of Parliament will lead the… pic.twitter.com/VGCGXPlLn5
— ANI (@ANI) May 17, 2025
Also Read..
Microsoft: ఇజ్రాయెల్ మిలిటరీకి ఏఐ టెక్నాలజీ ఇచ్చాం.. అంగీకరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ