Shehbaz Sharif | ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో పాక్ (Pakistan)పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడితో తోకముడిచిన దాయాది.. చివరికి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, ఇన్నాళ్లూ తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోన్న పాక్.. తాజాగా దాన్ని అంగీకరించింది. తమ కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్ వైమానికి దాడులు జరిపిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు.
శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్‌లో ఒక కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. మే 10 తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా తమ కీలకమైన వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన ఖచ్చితమైన దాడులను ధ్రువీకరించారు. ‘భారత ఆపరేషన్ ప్రారంభమైన కొన్ని క్షణాల తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ (Asim Munir) తెల్లవారుజామున 2.30 గంటలకు నాకు ఫోన్ చేశారు. దాడుల గురించి ఆయన నాకు తెలియజేశారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ సహా ఇతర స్థావరాలపై దాడి జరిగిందని చెప్పారు. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది’ అని పాక్ ప్రధాని వెల్లడించారు.
Also Read..
Donald Trump | ఎన్నారైలపై ట్రంప్ బాదుడు.. స్వదేశాలకు పంపే డబ్బుపై 5 శాతం ట్యాక్స్!