Traffic Diversions | హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5 తర్వాత ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే!
హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధించారు. శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Diversions) విధించారు. శనివారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగాయాత్ర నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం నుంచి సైనిక్ ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 5.30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలవనున్న యాత్ర.. సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక్ ట్యాంక్ చేరుకోనుంది.
దీంతో సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను అనుమతించరు. యాత్ర సాగుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

