Celebi Aviation | సెలెబి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు.. భారత్ నిర్ణయంపై కోర్టు మెట్లెక్కిన తుర్కియే సంస్థ
Celebi Aviation | జాతీయ భద్రతా కారణాలను చూపుతూ దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే తుర్కియే సంస్థ (Turkish Aviation) సెలెబి ఏవియేషన్ (Celebi Aviation) సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై సెలెబి సంస్థ కోర్టుమెట్లెక్కింది.
Celebi Aviation | ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసింది. దీంతో తుర్కియేపై భారత్ కఠిన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జాతీయ భద్రతా కారణాలను చూపుతూ దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే తుర్కియే సంస్థ (Turkish Aviation) సెలెబి ఏవియేషన్ (Celebi Aviation) సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై సెలెబి సంస్థ కోర్టుమెట్లెక్కింది. న్యూ ఢిల్లీ చర్యను ఢిల్లీ హైకోర్టులో చట్టపరంగా సవాల్ చేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అస్పష్టమైన జాతీయ భద్రతా సమస్యలను హేతుబద్ధంగా ఉదహరించారని తెలిపింది. భారత్ చర్య 3,791 ఉద్యోగులు, పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావం చూపుతుందని కంపెనీ వాదించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా న్యూ ఢిల్లీ ఈ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. కేంద్రం నిర్ణయాన్ని పక్కన పెట్టాలని కోరింది.
అంతకు ముందు ఈ వ్యవహారంపై స్పందించిన సెలెబి.. తమది తుర్కియేకి చెందిన సంస్థ కాదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ (Erdogan) కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుమార్తె తమకు బాస్ కాదని వివరణ ఇచ్చింది. సెలెబి సంస్థను ఎర్డోగాన్ కుమార్తె సుమేయే నియంత్రిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. అంతేకాదు తమ మాతృ సంస్థలో సుమేయే పేరుతో ఎవరికీ వాటాలు గానీ, యాజమాన్య హక్కులు గానీ లేవని స్పష్టం చేసింది. కంపెనీ యాజమాన్యం హక్కులన్నీ సెలెబియోగ్లు కుటుంబ సభ్యులైన కెన్ సెలెబియోగ్లు, కెనన్ సెలెబియోగ్లులకు మాత్రమే పరిమితం అని వెల్లడించింది. వీరికి ఎలాంటి రాజకీయ అనుబంధం లేదని తెలిపింది. తమ మాతృ సంస్థలో 65శాతం వాటాలు కెనడా, యూఎస్, యూకే, సింగపూర్, యూఏఈ, పశ్చిమ ఐరోపా దేశాలకు చెందిన సంస్థాగత మదుపరులవేనని కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు సెలెబి సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా, తుర్కియేకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద 2022 నవంబర్ 21 అనుమతి లభించింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలకు సెలెబి ఏవియేషన్ బాధ్యత వహిస్తున్నది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ వంటి కీలక విధులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కార్యకలాపాలన్నీ జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుర్కియేకి చెందిన సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత్ రద్దు చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసినట్లు అందులో పేర్కొంది.
Also Read..
Microsoft: ఇజ్రాయెల్ మిలిటరీకి ఏఐ టెక్నాలజీ ఇచ్చాం.. అంగీకరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

