ISIS sleeper cells | ఇద్దరు ఐసిస్ సభ్యులను ఎన్ఐఏ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్ (Abdul Fayyaz Shaikh), తల్హా ఖాన్ (Talha Khan) అనే ఇద్దరు ఉగ్రవాదులను ముంబై ఎయిర్ పోర్టు (Mumbai airport)లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఐసిస్ స్లీపర్ సెల్ (ISIS sleeper cells) విభాగంతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఇద్దరూ 2023 పుణే బాంబు తయారీ కేసు (Pune bomb case)లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వారిపై ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (non-bailable warrant) జారీ చేసింది. వారిపై రూ. 3 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. ఇండోనేషియాలో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో జకర్తా నుంచి ముంబైకి తిరిగి వచ్చే క్రమంలో బ్ల్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కారు. అనంతరం వారిని ఎన్ఐఏకి అప్పగించారు.
Also Read..
Haryana Student | పాక్కు సున్నితమైన సమాచారం లీక్.. హర్యానా విద్యార్థి అరెస్ట్
Congress | కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా.. శశిథరూర్ను ఎంపిక చేసిన కేంద్రం