Anand Mahindra | నిల్వలు కాదు, రిఫైనింగ్ ముఖ్యం.. లిథియం నిక్షేపాలపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Anand Mahindra | దేశంలో మరోసారి లిథియం నిక్షేపాలు (Lithium Reserves ) బయటపడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ (Rajasthan) లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా స్పందించారు.
Anand Mahindra | దేశంలో మరోసారి లిథియం నిక్షేపాలు (Lithium Reserves ) బయటపడిన విషయం తెలిసిందే. అత్యంత అరుదుగా లభించే ఈ ఖనిజాన్ని తొలిసారి జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో గుర్తించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తాజాగా స్పందించారు.
‘21వ శతాబ్దంలో వృద్ధికి కీలకమైన భారీ సహజ వనరుల నిల్వలను మనం ఎట్టకేలకు గుర్తించాం. భారత్‌కు విద్యుదీకరణ భవిష్యత్ ఉందనడానికి ఇది సంకేతం. కానీ, ఈ కీలకమైన మూలకం సరఫరా కావాలంటే నిల్వలు కాదు రిఫైనింగ్ (Refining ) ముఖ్యం. ఈ విషయంలో చైనా ముందంజలో ఉంది. మనం కూడా రిఫైనింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి త్వరగా అడుగులు వేయాల్సి ఉంది’ అని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.
తొలిసారి జమ్మూకశ్మీర్‌లో..
దేశంలో తొలిసారి లిథియం నిక్షేపాలను శాస్త్రవేత్తలు జమ్మూకశ్మీర్‌లో గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నిక్షేపాలను కనుగొన్నారు. సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఉన్న సలాల్ హైమనా ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇప్పుడు రాజస్థాన్‌లో..
జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన తర్వాత కొన్ని నెలలకే తాజాగా రాజస్థాన్‌లో భారీగా లిథియం నిక్షేపాలను అధికారులు కనుగొన్నారు. నాగౌర్ జిల్లాలోని డెగానా, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో గుర్తించిన లిథియం నిల్వలు దేశ అవసరాల్లో దాదాపు 80 శాతం వరకు సరిపడా ఉన్నాయని అధికారులు చెప్పారు. అంతేగాక కశ్మీర్లో గుర్తించిన నిల్వలతో పోల్చితే చాలా అధికమని తెలిపారు.
కాగా, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం అత్యంత కీలకమైంది. భారత్ కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. బ్యాటరీల తయారీలో, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఎలక్ట్రికల్ వాహనాల, ఇతర విద్యుత్ పరికరాల తయారీలో లిథియం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి లోహాలను భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో లిథియం నిల్వలు భారత్‌లో వెలుగు చూడటంతో.. భవిష్యత్తులో దీని దిగుమతులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, బ్యాటరీ ధరలు కూడా దిగిరానున్నాయి.ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక టన్ను లిథియం ధర దాదాపు రూ.58 లక్షల వరకు ఉన్నది.
Finally. We have sizeable reserves of a natural resource critical for growth in the 21st century. A signal that India has an ‘electrifying future.’ But the key element in the supply chain is refining, not reserves, where China has a huge lead. We need to step up quickly to… https://t.co/4lzEMCrJmY
— anand mahindra (@anandmahindra) May 9, 2023
Also Read..
Sudha Murthy | నారాయణ మూర్తితో మొదటి పరిచయం అలా జరిగింది.. హ్యాండ్సమ్గా ఉంటారనుకున్నా : సుధామూర్తి
Donald Trump | లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌కు జ్యూరీ షాక్.. భారీ జరిమానా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

