Loksabha Elections 2024 : బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమికి 400కిపైగా స్ధానాలు వస్తాయని, తమకు సాధారణ మెజారిటీ కోసం ప్లాన్ బీ అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌధరి స్పందించారు. అమిత్ షా వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ 400కిపైగా స్ధానాల నినాదం ఫలించబోదని స్పష్టం చేశారు.
బీజేపీ ఓవైపు 400కిపైగా స్ధానాలు సాధిస్తామని చెబుతోందని, అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోదీకి అధికారం దక్కబోదని తాము చెబుతున్నామని అన్నారు. ఈసారి 400కిపైగా స్ధానాలు కాషాయ కూటమి కల అని, మోదీ ఓటమి వాస్తవమని, ఈసారి జరిగేది ఇదేనని అధిర్ రంజన్ చౌధరి పేర్కొన్నారు. కాగా, ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోదీకి అండగా ఉంది. వారికి కులం, వయసుతో సంబంధం లేదు. మోదీ అంటే ఏంటి.? ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి..? అనేది వారికి తెలుసు అన్నారు.
‘ప్లాన్ ఏ’ విజయవంతమవుతుంది. ‘ప్లాన్ ఏ’ సక్సెస్ కావడానికి 60 శాతం కంటే తక్కవు అవకాశం ఉన్నప్పుడే ‘ప్లాన్ బి’ ని రూపొందించాలి. మాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా’ అని అమిత్షా పేర్కొన్నారు.
Read More :
Hyderabad | ప్రియుడి మోజులో భర్త హత్య.. గుండెపోటుతో చనిపోయాడని డ్రామా