Hyderabad | ప్రియుడి మోజులో భర్త హత్య.. గుండెపోటుతో చనిపోయాడని డ్రామా
ప్రియుడి మోజులో పడ్డ భార్య.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. పైగా, గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి, అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది. మూడు నెలల కిందట జరిగిన ఈ దారుణ ఘటన.. నిందితుడు తనంతట తానుగా పోలీసుల ఎదుట లొంగిపోవటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ప్రియుడితో కలిసి రౌడీషీటర్‌కు సుపారీ
- హత్య చేయించి గుండెపోటుగా చిత్రీకరణ
- మూణ్నెల్ల తర్వాత నిందితుడి లొంగుబాటు
- హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఘటన
Hyderabad | వెంగళరావునగర్, మే 16: ప్రియుడి మోజులో పడ్డ భార్య.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. పైగా, గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి, అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది. మూడు నెలల కిందట జరిగిన ఈ దారుణ ఘటన.. నిందితుడు తనంతట తానుగా పోలీసుల ఎదుట లొంగిపోవటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని శిఖర అపార్డ్మెంట్స్లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్‌కుమార్(40)కు భార్య శ్రీలక్ష్మి (33), ఇద్దరు మగ పిల్లలు (9, 8 ఏండ్లు) ఉన్నారు. బోరబండకు చెందిన రాజేశ్ (30)తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది. వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి.. చంపించాలని ప్లాన్ వేసింది. భర్త పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇండ్లు ఉన్నాయి. భర్తను చంపించి, ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని అనుకొన్నది.
ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి, శిఖర అపార్టమెంట్‌కు మకాం మార్పించి కుట్రకు తెరలేపింది. వీ రామారావునగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, ఎండీ మెహ్తాబ్ అలియాస్ బబ్బన్ను రాజేశ్ సంప్రదించి సుపారీ ఇచ్చాడు. గత ఫిబ్రవరి 1న ఉదయం పిల్లలిద్దర్ని స్కూల్లో దిగబెట్టేందుకు భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే, రాజేశ్వర్‌రెడ్డి, బబ్బన్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసి బాత్రూం గడియ తీయటంతో వారంతా బయటకు వచ్చారు. విజయ్‌కుమార్ తలపై డంబెల్స్‌తో కొట్టి గొంతు నులిమి చంపి, బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. బాత్రూంకి వెళ్లిన భర్తకు గుండెపోటు వచ్చి, గోడ తలకు తగిలి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. అదే రోజు బంధువులను పిలిపించి శ్రీనగర్‌కాలనీలోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు పూర్తి చేసింది.
మృతుడి కుటుంబంలో చనిపోయినవారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సి ఉండగా, విజయ్ మృతదేహాన్ని మాత్రం దహన సంస్కరాలు చేయటాన్ని బట్టి పథకంలో భాగంగానే ఆధారాలు చిక్కకుండా చేసినట్టు తెలుస్తున్నది. కాగా, విజయ్‌ది గుండెపోటు మరణం కాదని, తామే హత్య చేశామని, హత్య చేసినప్పటి నుంచి తనకు మనఃశాంతి లేకుండా పోయిందని, అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నానని రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్, బబ్బన్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు సెక్షన్లు 302, 201 కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. అయితే, సుపారీ పంపకాల్లో తేడాలు వచ్చాయా? లేక ఆమె తనకు కోరిక తీర్చలేదన్న కక్షతో నిందితుడు లొంగిపోయాడా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా, తండ్రి హత్యకు గురవటం, తల్లి జైలు పాలవటంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

