Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం గంటన్నర పాటు దంచికొట్టిన వానకు నగరం అతలాకుతలమైంది.
ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉంది. రంగారెడ్డి, మెదక్, సంగారెడి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.