Salman Khan | సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. యూకేలో భారత విద్యార్థికి లుక్అవుట్ నోటీసులు
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కు గత కొంతకాలంగా బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూకే (UK) లో వైద్య విద్య (medical education)ను అభ్యసిస్తున్న ఓ భారతీయ విద్యార్థి (Indian student) .. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కు గత కొంతకాలంగా బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. నటుడిని చంపుతామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌కు పోలీసులు భద్రతను పెంచారు కూడా. మరోవైపు బెదిరింపు కాల్స్, మెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూకే (UK) లో వైద్య విద్య (medical education)ను అభ్యసిస్తున్న ఓ భారతీయ విద్యార్థి (Indian student) .. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్ పంపినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ మేరకు సదరు విద్యార్థికి లుక్ అవుట్ సర్క్యులర్ (look out circular) జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సదరు విద్యార్థి హరియాణా ( Haryana)కు చెందిన వాడిగా పోలీసులు విచారణలో గుర్తించినట్లు చెప్పారు. యూకేలో ఉన్న అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు. కాగా, ప్రస్తుతం సదరు విద్యార్థి యూకేలో మెడికల్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో విద్యార్థి అకాడమిక్ సెషన్ ముగిసే సమయానికి ఈ ఏడాది చివరి నాటికి భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారి తెలిపారు. ప్రస్తుతం జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ (Goldy Brar) పేరుతో ఈ ఏడాది మార్చి నెలలో సదరు విద్యార్థి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read..
KTR | యూకే పర్యటనకు బయల్దేరిన మంత్రి కేటీఆర్
Priyamani | చిరంజీవితో కలిసి నటించాలని ఉంది : ప్రియమణి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

