లక్నో: డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి తన తండ్రిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. (Drug Addict Beats Father To Death) అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని కూడా అతడు కొట్టడంతో ఆమె గాయపడింది. ఆ తర్వాత ఇంటి నుంచి అతడు పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దత్తపురా ప్రాంతంలోని బాబా వాలీ గలిలో నివసిస్తున్న 32 ఏళ్ల సుధాంషు కదమ్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందిన అతడు ఇటీవల ఇంటికి తిరిగి వచ్చాడు.
కాగా, గురువారం సుధాంషు ఇంటి వద్ద రెచ్చిపోయాడు. 65 ఏళ్ల తండ్రి రవిని బేస్ బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి శకుంతల తలపైనా ఆ బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత ఇంటి నుంచి అతడు పారిపోయాడు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సుధాంషు తండ్రి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుధాంషును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతడి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.