Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, ఎస్పీ లక్ష్యంగా ప్రధాని మోదీ యూపీలోని పలు సభల్లో విమర్శలతో విరుచుకుపడ్డారు. హమీర్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎస్పీ-కాంగ్రెస్ తమ ఉద్దేశాన్ని స్పష్టంగా వెల్లడించాయని అన్నారు.
వారు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఆస్తులను ఆరా తీసి వాటిలో కొంత భాగాన్ని తమ ఓటు బ్యాంక్ అయిన ఓట్ జిహాద్ ప్రజలకు కట్టబెడతామని చెబుతున్నారని ఆరోపించారు. మీ ఆస్తిని ఏ ప్రభుత్వమైనా లాగేసుకునేందుకు మీరు అనుమతిస్తారా అని మోదీ ప్రశ్నించారు.
మీకు ఎంత భూమి ఉంది, ఎంత పెద్ద ఇల్లు ఉంది, మీకు బంగారం ఏమైనా ఉందా అనే వివరాలను ఆరా తీస్తూ ఎక్స్‌రే జరిపిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రస్తావించిందని ప్రధాని పేర్కొన్నారు.
Read More :
OG | ఎన్నికల బిజీ షెడ్యూల్‌కు ప్యాకప్.. పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం ఫిక్సయినట్టే..!