Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా ఇవాళ దాదాపు 300 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,300 దాటింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry Of India) డేటా ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 276 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4,302కి పెరిగింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,373 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తర ప్రదేశ్‌లో 201 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో నాలుగు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ (Covid-19)తో మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 3,281 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Also Read..
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదల బీభత్సం.. 43 మంది దుర్మరణం..!
NEET PG 2025 | ఆగస్టు 3న నీట్-పీజీ..! అనుమతి కోరుతూ సుప్రీంకోర్టుకు ఎన్బీఈ
Operation Sindoor | మోదీ జాతికి జవాబు చెప్పండి! ప్రధానికి ఎంపీల లేఖ..!