NDA meet : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఎన్డీఏ నేతల (NDA leaders) సమావేశం ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda), రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తోపాటు ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పోటీకి దింపాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు.
మొన్నటిదాకా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన జగదీప్ ధన్కఢ్ అనారోగ్య కారణాలతో ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దాంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక అనివార్యమైంది. ఈ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నారు.