Soni Singh : ఆమె పేరు సోనీ సింగ్ (Soni Singh). ఆమె ఒక మోడల్ (Model). డిజిటల్ కంటెంట్ క్రియేటర్ (Digital Content Creater) కూడా. ఇటీవల రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) కు వెళ్లిన ఆమె ఢిల్లీ (Delhi) కి తిరిగి వస్తుండగా ఓ అసభ్యకర ఘటన చోటుచేసుకుంది. ఆమె క్యాబ్ కోసం గురుగ్రామ్ (Gurugram) లో వేచివున్న సమయంలో ఓ యువకుడు ఆమె ముందు నిలబడి హస్త ప్రయోగం చేశాడు.
దాంతో ఆమె షాక్‌కు గురైంది. అతడి విపరీత చేష్టను తన ఫోన్లో బంధించింది. తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండలేక మరో క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా, ఉమెన్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆగస్టు 2న ఘటన జరుగగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగస్టు 4న వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది.
ఆ వీడియో వైరల్ కావడంతో ఆగస్టు 6న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేశామని, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం వెతుకుతున్నామని తెలిపారు. కాగా పబ్లిక్ ప్రదేశాల్లో పట్టపగలు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సోనీ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్‌లో తాను క్యాబ్ కోసం వేచిఉండగా జరిగిన ఘటన గురించి తన ఇన్‌స్టాలో వెల్లడించారు.
‘నేను రాజీవ్ చౌక్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్నా. ఓ వ్యక్తి అటూఇటూ తిరుగుతూ నా దగ్గరికి వచ్చాడు. నాకు కొద్దిదూరంలో నిలబడి నన్నే తదేకంగా చూస్తున్నాడు. ముందుగా అతడు మామూలుగా నిలబడి ఉన్నాడని అనుకున్నా. కానీ అతడు తన పాయింట్స్ జిప్ తీసి ఉన్నాడని తర్వాత గమనించా. నావైపే చూస్తూ హస్తప్రయోగం చేయడంతో షాకయ్యా. నా మొబైల్లో రికార్డు చేశా. ఆ తర్వాత అక్కడ ఇంకా ఉండలేక క్యాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేస్తే స్పందించలేదు. దాంతో మరో క్యాబ్ మాట్లాడుకుని అక్కడి నుంచి బయటపడ్డా’ అని సోనీ సింగ్ తన ఇన్‌స్టాలో పేర్కొన్నారు.