Karnataka police : కర్ణాటక పోలీసులు (Karnataka police) తమ తలపై ధరించే టోపీలు మారనున్నాయి. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ధరిస్తున్న బ్రిటిష్ కాలం నాటి స్లోచ్ హ్యాట్స్ (Slouch Hats) స్థానంలో తెలంగాణ స్టయిల్ నేవీ బ్లూ పీక్ క్యాప్స్ (Navy blue peak caps) ను తీసుకురానున్నారు. ఈ నేవీ బ్లూ క్యాప్స్ కంఫర్టుగా, ప్రయోజనకారిగా, మోడరన్ లుక్‌తో ఉంటుంది. ఈ కొత్త మోడల్ క్యాప్‌లకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దాంతో ఇన్నాళ్లూ బ్రిటిష్ కాలంనాటి స్లోచ్ హ్యాట్స్ ధరిస్తున్న కర్ణాటక కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఇప్పుడు తెలంగాణ పోలీస్ యూనిఫామ్‌ను ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన తెలంగాణ స్టయిల్ నేవీ బ్లూ పీక్ క్యాప్స్‌ను ధరించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ డిజైన్‌కు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర తదితరులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.