Protest : బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితాను సవరించడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ (Parliament) ఆవరణలో ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) ఆందోళనకు దిగింది. ఓటర్ల జాబితాను సవరించి ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని వారు మండిపడ్డారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైరపర్సన్ సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కూలీలను అరెస్టు చేయడంపై కూడా విపక్ష ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ విషయంలో తన ముఖ్యమంత్రులను నియంత్రించాలని చెప్పారు.