హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లయిన మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమె ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి వేధింపులకు పాల్పడ్డాడు. భీమ్ రాజ్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఓ యువతిని ఆర్య సమాజ్‌లో పెండ్లి చేసుకున్నాడు. అయితే మద్యానికి బానిసైన అతడు కొన్ని రోజులుగా భార్యను వేధిస్తున్నాడు.
ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలతోపాటు దుర్భాషలాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో భీమ్రాజ్పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.