Superyacht Amadia | అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువ లగ్జరీ సూపర్‌యాచ్ అయాడియా షిప్‌ను వేలం వేయబోతున్నది. ఈ నౌక రష్యాకు చెందింది కావడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్న స్వాధీనం చేసుకున్నది. ఈ వేలం సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మిత్రదేశాలతో పాటు రష్యాలోని ధనవంతులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇందులో కొందరు పుతిన్‌కు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అమెరికా కోరుతోంది.
రష్యన్ సూపర్‌యాచ్ట్ అమడియాను మూడేళ్ల క్రితం అమెరికా స్వాధీనం చేసుకుంది. ఈ యాచ్ ప్రస్తుతం శాన్ డియాగోలో ఉన్నది. ఇది 348 అడుగుల పొడవు ఉంటుంది. ఈ యాచ్‌ను ప్రత్యేకంగా 2017లో జర్మన్ కంపెనీ లర్సెన్ నిర్మించింది. ఈ సూపర్‌యాచ్ట్‌ను ఫ్రాంకోయిస్ జురెట్టి రూపొందించారు. లోపలి భాగాన్ని పాలరాయితో తీర్చిదిద్దారు. ఈ యాచ్‌లో ఎనిమిది స్టేట్ రూమ్‌లు, ఒక బ్యూటీ సెలూన్, ఒక స్పా, జిమ్, ఒక హెలిప్యాడ్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక లిఫ్ట్ ఉంటుంది. ఇందులో 16 మంది అతిథులు, 36 మంది సిబ్బందికి వసతి ఉంటుంది. అమెరికా స్వాధీనం చేసుకున్న అమాడియా వాస్తవ యజమాని ఎవరో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు.
ఇది కేమన్ దీవుల్లో ఉన్న మిల్ మారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఈ యాచ్ నిజమైన యజమాని ఆర్థికవేత్త, మాజీ రష్యన్ రాజకీయ నాయకుడు సులేమాన్ కెరిమోవ్ అని అమెరికా చెబుతూ వస్తున్నది. ఆయన 2018 నుంచి యూఎస్ ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రష్యన్ చమురు, గ్యాస్ కంపెనీ రోస్నెఫ్ట్ మాజీ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎడ్వర్డ్ ఖుడైనాటోవ్ ఈ యాచ్ యజమానిగా చెప్పుకుంటున్నారు. యాచ్ స్వాధీనంపై ఖుడైనాటోవ్ కోర్టులో అప్పీల్ చేస్తున్నారు. యాచ్ నిజమైన యజమాని కెరిమోవ్ పేరును దాచడమే దీని లక్ష్యమని యూఎస్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. ఈ యాచ్ స్వాధీనంపై ఖుడైనాటోవ్ కోర్టులో అప్పీల్ చేయనుండగా.. వేలం ఏమాత్రం సరికాదని.. చట్టపరంగా సవాల్ చేస్తామని ఆయన తరఫు న్యాయవాది న్యాయవాది ఆడమ్ ఫోర్డ్ పేర్కొంటున్నారు.