Shashi Tharoor : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై అదనంగా మరో 25 శాతం పన్నులు విధించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) స్పందించారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలకు భారత్ బదులు తీర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్‌పై అమెరికా ఇప్పటికే 25 శాతం టారిఫ్‌లు అమలుచేస్తుండగా.. అదనంగా మరో 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది కూడా అమల్లోకి వస్తే భారత్‌పై అమెరికా టారిఫ్‌లు 50 శాతానికి చేరనున్నాయి. దీనిపై శశిథరూర్ స్పందించారు.
‘ట్రంప్ టారిఫ్‌లపై ముందుగా మనం ఆ దేశంతో చర్చించాలి. మనపై ట్రంప్ ఎంత కోపంగా ఉన్నాడో నాకైతే తెలియదు. చైనాపై టారిఫ్‌లు విధించినప్పుడు వారికి 90 రోజుల గడువు ఇచ్చారు. మనకు మాత్రం కేవలం 21 రోజులే ఇచ్చారు. 21 రోజుల్లో చర్చలు ఫలించకపోతే మన వస్తువులపై అమెరికాలో 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. అదేగనుక జరిగితే మనం ప్రతీకార టారిఫ్‌లు విధించడమే ఉత్తమం’ అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్ 17 శాతం టారిఫ్‌లను మాత్రమే అమలు చేస్తోందని, దాన్ని కూడా 50 శాతానికి పెంచాలని థరూర్ సూచించారు. వాళ్లు మనపై సుంకాలు వేస్తే మనం వాళ్లపై కూడా వేయాలని అన్నారు.