Gas cylinder : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ (Gas cylinder) పేలిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం విశాఖపట్నం (Vizag) నగరంలోని ఫిషింగ్ హార్బర్ (Fishing Harber) ఏరియాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫిషింగ్ హార్బర్ ఏరియాలోని హిమాలయ బార్ దగ్గర గురువారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.