NDA Meeting | ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting) కొనసాగుతోంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ (PM Modi) నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఎన్డీయే లోక్‌సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించారు. రాజ్‌నాథ్ ప్రతిపాదనను అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, నితీశ్ కుమార్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, కుమారస్వామి తదితరులు బలపరిచారు.
తీర్మానం సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ఎంపీలందరినీ అభినందనలు తెలిపారు. ‘కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ నా అభినందనలు. ఈ రోజు ఎన్డీయే నాయకుడిని ఎన్నుకోవడానికి మనం ఇక్కడకు వచ్చాము. నరేంద్ర మోదీ పేరు దీనికి అత్యంత అనుకూలమని నేను నమ్ముతున్నాను’ అని సమావేశంలో తీర్మానించారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి విశేష సేవలందించిందన్నారు. ప్రపంచ దేశాల నేతలు సైతం మోదీని ప్రశంసిస్తున్నారన్నారు. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తు చేశారు.
ఇక ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు వచ్చిన ఎన్డీఏ నేతలకు మొదట ప్రధాని మోదీ స్వాగతం పలికారు. సంవిదాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్లోకి వచ్చిన మోదీ.. తొలుత అక్కడ ఉంచిన రాజ్యాంగం పుస్తకాన్ని కంళ్లకు అద్దుకున్నారు. ఆ పుస్తకానికి ఆయన నమస్కరించారు. ఆ తర్వాత మోదీ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో.. మోదీ-మోదీ నినాదాలతో హోరెత్తించారు.
Also Read..
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
PM Modi: ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం