యూ.కే.ప్రధానితో ఫోన్ లోమాట్లాడిన మోడీ...

ఢిల్లీ: యూ.కే.ప్రధానీ బోరిస్ జాన్సన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్నసవాళ్ళ గురించి ఇరువురు చర్చించుకున్నారు. టీకా అభివృద్ధి, తయారీ గురించి భారతదేశం, యు.కె. మధ్య సహకారాన్ని వారు ఈ సందర్భంగా సమీక్షించారు. కోవిడ్ అనంతర, బ్రెక్సిట్ అనంతర కాలంలో భారత-యు.కె. ల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్న తమ కోరికను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.
వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రీయ పరిశోధన, నిపుణులు, విద్యార్థుల చైతన్యం, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని పరస్పరం పెంపొందించుకోడానికి అద్భుతమైన అవకాశాలున్నాయని నాయకులిద్దరూ అంగీకరించారు. భారత-యు.కె. దేశాల మధ్య భాగస్వామ్యం కోసం ప్రతిష్టాత్మక దీర్ఘకాలిక ప్రణాళికను త్వరగా ఖరారు చేయడానికి ఇరువైపుల అధికారులు తమ కృషి ని కొనసాగిస్తారని ఇరువురు అంగీకరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..