కశ్మీర్ లోయలో వెల్లివిరిసిన మత సామరస్యం..
కశ్మీర్ లోయ| కశ్మీర్లో మతసామరస్యం వెల్లివిరిసింది. ఒకప్పుడు కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టిన చోటే.. ఓ హిందువు అంత్యక్రియలను ముస్లిం సోదరులు నిర్వహించారు.

శ్రీనగర్: కశ్మీర్లో మతసామరస్యం వెల్లివిరిసింది. ఒకప్పుడు కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టిన చోటే.. ఓ హిందువు అంత్యక్రియలను ముస్లిం సోదరులు నిర్వహించారు. పుల్వామా జిల్లాలోని తహబ్ గ్రామానికి చెందిన చమన్ లాల్.. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఏడు పదుల వయస్సున్న ఆయన స్నేహితుల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. కాగా, ఆయన వయోధిక సమస్యలతో శనివారం మృతిచెందారు. గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు కొద్దిమందే ఉన్నారు. ఆయన కుమారుడు, కూతురు జమ్ములో ఉంటున్నారు. వారు గ్రామానికి చేరుకునేలోపే.. లాల్ ఇంటి చుట్టుపక్కన ఉన్నవారే అయినవారు అయ్యారు. ఆయన అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. అతని పార్ధీవ దేహాన్ని తమ భుజాలపై మోస్తూ భారీ సంఖ్యలో యువకులు, పెద్దలు స్మశానవాటికకు తరలించారు.

కాగా, తమ తండ్రిని సొంతమనిషిలా చూసుకున్న గ్రామస్తులకు చమన్ లాల్ కుమారుడు ధన్యవాదాలు తెలిపారు. చమన్ లాల్‌ను తాము ఎప్పుడూ పండిగా చూడలేదని, తమలో ఒకడిగానే భావించామని మహ్మద్ సుల్తాన్ అనే వృద్ధుడు అన్నారు. అందుకే అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తాము పూర్తిచేశామని చెప్పారు.
1990లో కశ్మీరీ లోయలో జరిగిన హింస తర్వాతా చాలా పండిట్ కుటుంబాలు అక్కడి నుంచి వలస వెళ్లాయి. అయితే చమన్ లాల్ వంటివారు కొద్ది మాత్రమే సొంత ఊరును వదిలి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా
పాకిస్థాన్‌లో తొలి హిందూ మహిళా కలెక్టర్!
ఆ ఖైదీలను విడుదల చేయండి
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
ప్రాణాలు నిలిపే పొడి డీఆర్డీవో సంజీవని
రకుల్ పెళ్లిపై నోరు విప్పిన మంచు లక్ష్మీ
కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

