Terror Threat | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)కి ఉగ్ర బెదిరింపులు (Terror Threat) కలకలం రేపుతున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు (Mumbai Police) ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. నగరంలో మానవబాంబులతో (human bombs) దాడికి ప్లాన్ చేసినట్లు బెదిరించారు. కోటి మంది లక్ష్యంగా ఈ దాడి జరుగుతుందని.. నగరం మొత్తం దద్ధరిల్లుతుందంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ముంబై పోలీసులు హై అలర్ట్ (high alert) ప్రకటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై ట్రాఫిక్ పోలీసు హెల్ప్ లైన్ నంబర్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. నగరం మొత్తం దద్ధరిల్లేలా 34 వాహనాల్లో 400 కిలోల RDX పేలుడు పదార్థాలను సిద్ధం చేసినట్లు బెదిరించారు. అనంత చతుర్దశి (Anant Chaturdashi) సందర్భంగా దాదాపు కోటి మందిని చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ ఉగ్ర బెదిరింపులతో ముంబై పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పెంచినట్లు ముంబై పోలీసులు తెలిపారు. లష్కరే జిహాదీ అనే సంస్థ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు వెల్లడించారు.
Also Read..
Tesla | భారత్‌లో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా.. ఇంతకీ ఎవరు కొన్నారంటే..?
India at UN | యుద్ధ భూమిలో సమస్యలకు పరిష్కారాలుండవు.. ఉక్రెయిన్ పరిస్థితిపై ఐరాసలో భారత్
Pilot arrest | రహస్యంగా మహిళల వీడియోల రికార్డు.. పైలట్ అరెస్ట్..!