Tesla | భారత్‌లో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా.. ఇంతకీ ఎవరు కొన్నారంటే..?
Tesla | భారత విపణిలోకి అడుగుపెట్టిన తర్వాత టెస్లా తాజాగా తన తొలి కారు (first Tesla car)ను కస్టమర్‌కు డెలివరీ చేసింది.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్ చేసింది. భారత విపణిలోకి అడుగుపెట్టిన తర్వాత టెస్లా తాజాగా తన తొలి కారు (first Tesla car)ను కస్టమర్‌కు డెలివరీ చేసింది.
#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from ‘Tesla Experience Center’ at Bandra Kurla Complex, Mumbai being made to State’s Transport Minister Pratap Sarnaik.
‘Tesla Experience Center’, the first in India, was inaugurated on July 15 this year. pic.twitter.com/2Y69HnzyYG
— ANI (@ANI) September 5, 2025
తెలుపు రంగు టెస్లా ‘వై మోడల్’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik) కొనుగోలు చేశారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (Bandra Kurla Complex)లోని టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ (Tesla Experience Center) నుంచి తొలి కారును ఇవాళ మంత్రికి సంస్థ ప్రతినిధులు డెలివరీ చేశారు. కారు తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం పట్ల మంత్రి ప్రతాప్ సర్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కారును కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
#WATCH | Mumbai, Maharashtra: Delivery of the first Tesla (Model Y) car from ‘Tesla Experience Centre’ at Bandra Kurla Complex, Mumbai, being made to the State’s Transport Minister Pratap Sarnaik.
‘Tesla Experience Center’, the first in India, was inaugurated on July 15 this… pic.twitter.com/UyhUBCYygG
— ANI (@ANI) September 5, 2025
వై మోడల్ ధర వివరాలు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది.
వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది.
భారత విపణిలో టెస్లాకు నిరాశే..
మరోవైపు ఎన్నో అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదని సమాచారం. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 600 బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువ. ఎందుకంటే టెస్లా ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. దీంతో భారత్‌లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని కంపెనీకి చెందిన కీలక వ్యక్తులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. టెస్లాకు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ ఎక్కువ ధర కారణంగా భారత EVమార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్నది టాక్.
Also Read..
Tim Cook | అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు..? యాపిల్ సీఈవోకు ట్రంప్ సూటి ప్రశ్న
Anil Ambani | అనిల్ అంబానీకి మరో షాక్.. సీబీఐ కేసు నమోదు
Donald Trump | టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. మస్క్‌కు అందని ఆహ్వానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

