Tim Cook | అమెరికాలోని టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు (tech CEOs) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రత్యేకంగా విందు (trump hosts dinner) ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House)లో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు. ఈ విందు సందర్భంగా టెక్ సీఈవోలకు ట్రంప్ కీలక సూచనలు చేశారు. అమెరికా బయట పెట్టుబడులు పెట్టడం ఆపి.. స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు.
ఈ సందర్భంగా యాపిల్ సీఈవో (Apple CEO) టిమ్ కుక్ (Tim Cook)తో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా బయట పెట్టుబడులు పెట్టడం ఆపి.. స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు. అమెరికాలో యాపిల్ ఎంత పెట్టుబడి పెడుతుంది..? అంటూ ప్రశ్నించారు. మీరు ఎంత పెట్టుబడి పెడతారు..? అంటూ ప్రశ్నించారు. ఇందుకు టిమ్ కుక్ స్పందిస్తూ.. 600 బిలియన్ డాలర్లు అంటూ బదులిచ్చారు.
.@Apple CEO @tim_cook: “I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States… That says a lot about your focus and your leadership and your focus on innovation.” pic.twitter.com/289vkiB6vy
— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025
కాగా, భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించడాన్ని ట్రంప్ మొదట్నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని టిమ్ కుక్‌తో ట్రంప్ స్వయంగా తెలిపారు. భారత్‌లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఈ ఏడాది ఖతార్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో సూచించారు. ‘నాకు టిమ్ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైంది. అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని టిమ్ కుక్కు వివరించా. భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దేశం తనను తాను చూసుకోగలదని చెప్పా. నా వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు యూఎస్‌లో 500బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి బయట పెట్టుబడులు ఆపి.. స్వదేశానికి రావాలంటూ టిమ్‌కుక్‌కు చెప్పడం గమనార్హం.
ఇక ట్రంప్ ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, బ్లూ ఆరిజిన్ సీఈవో డేవిడ్ లింప్, ఒరాకల్ సీఈవో సఫ్రా కాట్జ్ తదితరులు హాజరయ్యారు. అయితే, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)ను మాత్రం ఈ విందుకు ఆహ్వానించకపోవడం గమనార్హం.
Also Read..
Donald Trump | టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. మస్క్‌కు అందని ఆహ్వానం
Donald Trump | రక్షణశాఖ కాదు.. ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ : ట్రంప్
Israel Hamas War | గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. 64 వేలు దాటిన మృతులు