రైల్వే క్రాసింగ్ సమస్యలు పరిష్కరించాలి
మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే క్రాసింగ్ సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవను సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎంను కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
- సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు ఎమ్మెల్యే మర్రి వినతి
మల్కాజిగిరి, మార్చి 9 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని రైల్వే క్రాసింగ్ సమస్యలు పరిష్కరించేలా చూడాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవను సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎంను కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌యూబీలు నిర్మించాలని, మచ్చబొల్లారం డివిజన్లోని రైల్వే బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే టన్నెల్ నిర్మాణం చేయాలన్నారు.
ఎల్సీ 250 బొల్లారం రైల్వేస్టేషన్ వద్ద ప్రతిపాదించిన ఆర్ఓబీ కాకుండా ఆర్యూబీ నిర్మించాలన్నారు. మల్కాజిగిరి రైల్వే స్టేషన్ పరిసరాల్లో వర్షపునీరు, డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నివారించాలన్నారు. ఆర్కేపురం రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేట్ వద్ద పాదచారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలన్నారు. తుర్కపల్లి, జనప్రియ మచ్చబొల్లారం, వాజ్పేయినగర్, సఫిల్‌గూడ ప్రాంతాల్లో ఆర్యూబీ కోసం చేసిన శంకుస్థాపనల పనుల్లో వేగంవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారంపై తనిఖీలు చేపట్టి, పర్యవేక్షిస్తామని జీఎం హామీ ఇచ్చారని చెప్పారు. రైల్వే అధికారులు కిరణ్, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్‌రెడ్డి, మేకల రాము యాదవ్, డోలి రమేశ్, ఢిల్లీ పరమేశ్, నేమూరి శ్రీధర్, అమీనుద్దీన్, చిన్నయాదవ్, హేమంత్ పటేల్, బైరు అనిల్, వెంకటేశ్, నర్సింగ్‌రావు, రవీందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

