Donald Trump | అమెరికాలోని టెక్ సంస్థల అధిపతులు, సీఈవోలకు (tech CEOs) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రత్యేకంగా విందు ఇచ్చారు (trump hosts dinner). గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House)లో ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన సీఈవోలు హాజరయ్యారు.
మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, బ్లూ ఆరిజిన్ సీఈవో డేవిడ్ లింప్, ఒరాకల్ సీఈవో సఫ్రా కాట్జ్ తదితరులు హాజరయ్యారు. అయితే, ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)ను మాత్రం ఈ విందుకు ఆహ్వానించకపోవడం గమనార్హం.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై మస్క్ తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే మస్క్ కృషి వల్లే ఆయన ఈ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మస్క్‌కు ట్రంప్ తన కేబినెట్లో కీలక డోజ్ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఓ బిల్లు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మిత్రులు కాస్తా శత్రువులుగా మారారు. బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత డోజ్ శాఖ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. టెస్లా బాస్‌ను ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు వైట్‌హౌస్ విందుకు మస్క్ ప్రత్యర్థి అయిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌ను ట్రంప్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ విందు సందర్భంగా టెక్ సీఈవోలకు ట్రంప్ కీలక సూచనలు చేశారు. అమెరికా బయట పెట్టుబడులు పెట్టడం ఆపి.. స్వదేశానికి తిరిగి రావాలని సూచించారు.
Also Read..
Afghanistan Earthquake | అఫ్గానిస్థాన్‌లో వరుస భూకంపాలు.. గంట వ్యవధిలో రెండు సార్లు ప్రకంపణలు
అమెరికా విద్య ఎండమావేనా?.. తగ్గిన ఉపాధి అవకాశాలు.. పెరిగిన జీవన వ్యయం
దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత