Afghanistan Earthquake | అఫ్గానిస్థాన్‌లో వరుస భూకంపాలు.. గంట వ్యవధిలో రెండు సార్లు ప్రకంపణలు
వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.
కాబూల్: వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. తొలుత తెల్లవారుజామున 3.16 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో, 7.46 గంటలకు మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది. మూడు భూకంపాలు రాజధాని కాబూల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి.
EQ of M: 4.9, On: 05/09/2025 03:16:43 IST, Lat: 34.57 N, Long: 70.42 E, Depth: 120 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/IStFrki1sh— National Center for Seismology (@NCS_Earthquake) September 4, 2025
గురువారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. తొలుత రాత్రి 10.26 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించగా, అనంతరం 11.58 గంటలకు 4.1 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 2200 మందికిపైగా మరణించారు. మరో 3640 మంది గాయపడ్డారు.
EQ of M: 5.2, On: 05/09/2025 07:00:06 IST, Lat: 34.51 N, Long: 70.58 E, Depth: 140 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QAWVCwy6Er— National Center for Seismology (@NCS_Earthquake) September 5, 2025
EQ of M: 4.6, On: 05/09/2025 07:46:52 IST, Lat: 34.66 N, Long: 70.71 E, Depth: 180 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/yAhTnimQtU— National Center for Seismology (@NCS_Earthquake) September 5, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

