రోమ్: ప్రసిద్ధ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ (91) వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వస్త్ర రంగంలో విప్లవం తీసుకొచ్చారు. అర్మానీ గ్రూప్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, తమ కంపెనీ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, అలుపెరుగని చోదకశక్తి అయిన జార్జియో మరణించినట్లు తెలిపింది.
ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఆయనను ‘రే జార్జియో’ లేదా కింగ్ జార్జియో అని కూడా పిలుస్తారు. ఆధునిక ఇటాలియన్ శైలి, సొగసుదనాలకు అర్మానీ పెట్టింది పేరు. డిజైనర్‌గా కళను, వ్యాపారవేత్తగా నైపుణ్యాన్ని మేళవించి తన కంపెనీని నడిపారు.