Donald Trump | రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు విభాగాలు, పాలనా పరమైన అంశాల్లో కీలక మార్పులు చేశారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ (Department of War)గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్‌ను ట్రంప్ త్వరలోనే పాస్ చేయనున్నారు.
‘పీట్ హెగ్సెత్ (Pete Hegseth) తరచూ అమెరికా రక్షణశాఖ (US Defence Department) అంటూ సంబోధిస్తుంటారు. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. రక్షణ అనే పదం ఎందుకు? గతంలో దీన్ని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా పిలిచేవారు. ఇకపై మనం అలానే పిలుద్దాం. అది ఎంతో శక్తిమంతమైన పదం. అదే శక్తితో గతంలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో గెలిచాం. ప్రతి విషయంలోనూ ముందంజలో నిలిచాం. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దాం’ అని ట్రంప్ తెలిపారు.
1949 వరకు అమెరికా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. రెండో ప్రపంచ యుద్ధం (World War II) తర్వాత .. 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్చారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం రక్షణశాఖ మంత్రిగా పీట్ హెగ్సెత్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఆయన్ని ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్‌గా పిలవనున్నారు.
Also Read..
Donald Trump | టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. మస్క్‌కు అందని ఆహ్వానం
Donald Trump | హార్వర్డ్‌కు నిధుల కోత.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
సుంకాలతో భారత్ చంపుతున్నది!.. మేం ప్రతీకార సుంకాలు విధించ బట్టే వారు దారికొచ్చారు: ట్రంప్