Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం (AICC headquarters) నుంచి ఈ యాత్ర మొదలైంది. నిగంబోథ్ ఘాట్ వరకూ యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇక ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు.
#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken out of the AICC headquarters. pic.twitter.com/ouuAgsQ5qf
— ANI (@ANI) December 28, 2024
Also Read..
Manmohan Singh | మన్మోహితమే.. శోకసంద్రంలో భారతావని!
Manmohan Singh | నిగమ్బోధ్ ఘాట్లో మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు..!
Union Cabinet | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం