Manmohan Singh | నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు..!
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి అంత్య క్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది.
Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి అంత్య క్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని పేర్కొంది. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
మన్మోహన్ స్మారక స్థలం నిర్మించండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
ఇదిలా ఉంటే, మన్మోహన్ సింగ్‌కు అంత్య క్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్ లో ఖర్గే మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై రెండు పేజీల లేఖ రాసిన ఖర్గే, రాజ నీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంత్య క్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వం అని కొనియాడారు.
ఆయన నివాసంలోనే మన్మోహన్ పార్దివ దేహం
ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో ఉంచుతారు. తదుపరి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

