Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో త్రివిధ దళాధిపతులు (Military chiefs) సమావేశమయ్యారు. సీడీఎస్ అనిల్ చౌహాన్‌తో కలిసి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) గురించి రాష్ట్రపతికి వివరించారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను కూడా వివరించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా రాష్ట్రపతి అభివర్ణించారు. ఈ మేరకు సాయుధ దళాల తెగింపు, అంకిత భావాన్ని ప్రశంసించారు.
General Anil Chauhan, Chief of Defence Staff, along with General Upendra Dwivedi, Chief of the Army Staff, Air Chief Marshal A. P. Singh, Chief of the Air Staff, and Admiral Dinesh K. Tripathi, Chief of the Naval Staff, called on President Droupadi Murmu and briefed her about… pic.twitter.com/7o6CSYzYvA
— ANI (@ANI) May 14, 2025
Also Read..
BSF Soldier | బీఎస్ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్
Justice BR Gavai | సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
Arunachal Pradesh: అరుణాచల్‌కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా ఖండించిన భారత్