BSF Soldier | పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)ని దాటి పాక్ భూభాగంలోకి వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్‌ను (BSF Soldier) పాక్ ఎట్టకేలకు భారత్‌కు అప్పగించింది. ఇవాళ అట్టారి చెక్ పోస్ట్ వద్ద జవాన్‌ను పాక్ రేంజర్లు (Pakistan Rangers) భారత అధికారులకు అప్పగించారు.
గత నెల 23న మధ్యాహ్నం సమయంలో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణమ్ కుమార్ షా (Purnam Kumar Shaw)అనుకోకుండా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ)ని దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని పాక్ రేంజర్లు తమ అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతడి విడుదలపై భారత అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఈక్రమంలో ఇవాళ ఎట్టకేలకు సదరు జవాన్‌ను భారత్‌కు అప్పగించారు.
182 బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన సింగ్ పశ్చిమ బెంగాల్ వాసి. ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్థాన్ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్ జరిపారు. అయితే, బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించేందుకు పాక్ రేంజర్లు నిరాకరిస్తూ వచ్చాయి. ఆ జవాన్ ఆచూకీని కూడా చెప్పలేదు. దీంతో జవాను కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.
Also Read..
Global Times X Account | చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసిన భారత్
Justice BR Gavai | సీజేఐ జస్టిస్ గవాయ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..
Arunachal Pradesh: అరుణాచల్‌కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా ఖండించిన భారత్