Arunachal Pradesh: అరుణాచల్‌కు మళ్లీ పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా ఖండించిన భారత్
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ అంశంలో చైనా వ్యవహరిస్తున్న తీరును భారత్ మరో సారి ఖండించింది. అరుణాచల్‌లోని పేర్లను చైనా మళ్లీ మార్చేసింది. కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) అంశంలో చైనా వ్యవహరిస్తున్న తీరును భారత్ మరో సారి ఖండించింది. ఆ రాష్ట్రాన్ని తమ మ్యాప్‌లో చైనా చూపించుకుంటున్నది. ఇక అరుణాచల్‌లోని పేర్లను కూడా చైనా మార్చేసింది. కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఇదో వ్యర్థ ప్రయత్నమని పేర్కొన్నది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగమని ఇండియా వెల్లడించింది.
అరుణాచల్‌ను జాంగ్నాన్గా చైనా రిఫర్ చేస్తున్నది. టిబెట్‌కు దక్షిణ భాగంగా తన మ్యాప్‌లో ప్రదర్శిస్తున్నది. డ్రాగన్ చేస్తున్న ఆ ప్రయత్నాలు ఇండియా కొట్టివేసింది. పేర్లు మార్చే ప్రక్రియపై చర్యలు తీసుకోవాలని గతంలో రెండు దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ భూభాగం అని, ఆ రాష్ట్రాన్ని తమ నుంచి వేరు చేయలేరని విదేశాంగ శాఖ తెలిపింది. చైనా పేర్లను సృష్టిస్తోందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. ఇండియాలో అరుణాచల్ అంతర్గతమని, విడదీయలేదని విదేశాంగ శాఖ తెలిపింది.
గత ఏడాది ఏప్రిల్‌లో రెండు దేశాలు అనేక ప్రాంతాలకు పేర్లు పెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న కొన్ని పట్టణాలక చైనా పేర్లు పెట్టింది. దీనికి బదులుగా టిబెట్‌లో ఉన్న 30 ప్రాంతాలకు ఇండియా పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. పేర్లు పెట్టే ప్రక్రియతో చైనా రాజకీయం చేస్తున్నట్లు ఇండియా ఆరోపించింది. అంతర్జాతీయ చట్టాలు, ద్వైపాక్షి ఒప్పందాల ప్రకారం ఆ ప్రక్రియ నిలవదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

