Microsoft | ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు (layoffs) కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు వందల మంది ఉద్యోగులను (employees) ఇంటికి పంపుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 130కిపైగా కంపెనీలు దాదాపు 61 వేల మందికి పైగా ద్యోగులను తొలగించాయి. ఇక ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన (layoff) విషయం తెలిసిందే.
తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్‌కు సంస్థ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మందిపై వేటు వేయనున్నట్లు తెలిపింది. వచ్చే వారం ప్రారంభంలో లేఆఫ్స్ గురించి సంస్థ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. వేలాది మందిపై ఈ ప్రభావం ఉండనున్నట్లు సమాచారం. తాజా లేఆఫ్స్లు Xbox విభాగంలో (Xbox division) ఉండనున్నట్లు సమాచారం. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. వరుస లేఆఫ్స్‌తో సంస్థలోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
కాగా, మైక్రోసాప్ట్ ఈ ఏడాది మే నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తమ సిబ్బందిలో మూడు శాతం మందికి లేఆఫ్‌లు ఇచ్చింది. అంటే దాదాపు 6వేల మందిని తొలగించింది. 2023లో 10 వేలమందికి ఉద్వాసన పలికిన అనంతరం ఇదే రెండో అతిపెద్ద తొలగింపు. మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించడం, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడమే ముఖ్య లక్ష్యమని సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక ఈ ఏడాది జనవరిలో కూడా పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించిన విషయం తెలిసిందే. ఈనెల ఆరంభంలో కూడా పలువురిపై సంస్థ వేటు వేసింది. డైనమిక్ మార్కెట్లో పోటీదారుగా నిలవడానికి, కంపెనీ పునర్ నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘మార్కెట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేస్తూన్నాం’ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
Also Read..
Tawi river | తావి నదిలో చిక్కుకుపోయిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Shubhanshu Shukla | రోదసి యాత్రకు రెఢీ.. డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వ్యోమగాములు