Man Stabs Mother’s Lover | తల్లి ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపైనే
Man Stabs Mother’s Lover | తల్లిని తీసుకుని పారిపోయిన ప్రియుడిపై ఆమె కుమారుడు పగ పెంచుకున్నాడు. గ్రామానికి వచ్చిన అతడిని 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై నిల్చొని ఉన్నాడు.
బెంగళూరు: తల్లిని తీసుకుని పారిపోయిన ప్రియుడిపై ఆమె కుమారుడు పగ పెంచుకున్నాడు. గ్రామానికి వచ్చిన అతడిని 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతదేహంపై నిల్చొని ఉన్నాడు. (Man Stabs Mother’s Lover) కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బసదోని గ్రామానికి చెందిన 51 ఏళ్ల బసప్ప హోసమణి 2016లో ఒక మహిళతో కలిసి పారిపోయాడు. కొల్హాపూర్‌లో అతడు స్థిరపడ్డాడు.
కాగా, తల్లితో కలిసి పారిపోయిన బసప్ప హోసమణిపై ఆమె కుమారుడు ఎరయ్య మఠపతి పగ పెంచుకున్నాడు. అతడ్ని హత్య చేసేందుకు పదేళ్లుగా ఎదురుచూశాడు. అయితే బసప్ప ఇటీవల ఆ గ్రామానికి వచ్చాడు. సవదత్తి సమీపంలోని ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే దారిలో ఎరయ్య మఠపతి కాపుకాశాడు. రోడ్డుపై వెళ్తున్న బసప్పను బైక్‌తో ఢీకొట్టాడు. కత్తితో 16 సార్లు పొడిచి చంపాడు. పోలీసులు వచ్చే వరకు మృతుడి ఛాతిపై నిల్చొని ఉన్నాడు.
మరోవైపు ఈ హత్య చూసి ఆ రోడ్డుపై వెళ్లే జనం షాక్ అయ్యారు. నిందితుడు ఎరయ్య మఠపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. బసప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Car Tries To Run Over Man | నగ్నంగా మారి వ్యక్తి హంగామా.. అతడిపైకి కారు దూకించేందుకు యత్నం
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

