లక్నో: ‘నీ చెల్లి పారిపోయిందంటూ’ పొరుగింటి దంపతులు పదేపదే హేళన చేశారు. దీనిని సహించలేని వ్యక్తి మరొకరితో కలిసి వారిని కాల్చి చంపాడు. ఆ ఇంట్లోని బంగారు ఆభరణాలు దోచుకున్నారు. (Man Kills Neighbour Couple) ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ సోదరి వేరే కులానికి చెందిన వ్యక్తితో ఇంటి నుంచి పారిపోయింది. పొరుగున నివసించే మహేష్ చంద్ర కుటుంబం ‘నీ చెల్లి పారిపోయిందంటూ’ అతడ్ని పదే పదే హేళన చేస్తున్నారు.
కాగా, సహించలేకపోయిన ఆనంద్ పొరుగింటి కుటుంబంపై పగ తీర్చుకోవాలని భావించాడు. వారి బంధువైన అర్జున్‌తో కలిసి కుట్రపన్నాడు. ఫిబ్రవరి 18న జరగబోయే కొడుకు పెళ్లి కోసం మహేష్ చంద్ర కొనుగోలు చేసిన నగలను కూడా దోచుకోవాలని ప్లాన్ చేశారు.
మరోవైపు అర్ధరాత్రి వేళ ఆనంద్, అర్జున్ కలిసి మహేష్ చంద్ర ఇంట్లోకి చొరబడ్డారు. తొలుత అతడిపై కాల్చులు జరిపారు. శబ్దానికి ఆయన భార్య రావడంతో ఆమెను కూడా కాల్చి చంపారు. ఆ ఇంట్లోని బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు.
ఆ దంపతుల హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వదిలేసిన టార్చిలైట్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆనంద్, అర్జున్ను అరెస్ట్ చేశారు. రెండు పిస్టల్స్‌తో పాటు వారు దోచుకున్న నగలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Watch: చిన్నారికి తృటిలో తప్పిన బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్
Watch: గుర్రంపై ఊరేగిన దళిత వరుడు.. కత్తులతో దాడికి అగ్రవర్ణాలు యత్నం