కోల్‌కతా: రైల్వే స్టేషన్‌లోని ఫుట్ఓవర్ బ్రిడ్జి పై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్‌కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Man Dies By Electrocution On Train) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 3న రాత్రి 7.30 గంటల సమయంలో బల్లిగంజ్ స్టేషన్‌లోని ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఒక వ్యక్తి కిందకు దూకాడు. రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.
కాగా, అదే సమయంలో ఒక లోకల్ రైలు స్టేషన్‌కు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకిన ఆ వ్యక్తి లోకల్ రైలుపై పడ్డాడు. ఓవర్‌హెడ్ హైటెన్షన్ విద్యుత్ వైర్లలో చిక్కుకున్నాడు. విద్యుదాఘాతానికి గురై మరణించాడు. రైలుపై మంటల్లో కాలిపోయాడు.
మరోవైపు ఆ లోకల్ రైలులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే కంపార్ట్మెంట్ల నుంచి కిందకు దిగారు. రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ లైన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రైల్వే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైలుపై ఉన్న వ్యక్తి కాలిన మృతదేహాన్ని తొలగించారు. పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
అయితే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడ్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన వల్ల సీల్దా సౌత్ సెక్షన్ రైల్వే మార్గంలో రద్దీ వేళ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Also Read:
Watch | ఇంటి పనులు చేసే బాలికకు వేధింపులు.. తనిఖీ సందర్భంగా బెడ్ బాక్స్‌లో దాచారు
Watch: చిన్నారికి తృటిలో తప్పిన బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్