భోపాల్: ఆహారం విషయంలో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తి తన రెండో భార్యను కొట్టి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల పాటు ఆ ఇంట్లో ఉన్నాడు. భార్య మృతదేహం పక్కనే మంచంపై నిద్రించాడు. (man kills wife, sleeps with body) మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల జగదీష్ దాబర్ తన మొదటి భార్య, నలుగురు పిల్లలను వదిలేశాడు. ఆ తర్వాత మరదలు అయిన 25 ఏళ్ల రీమాబాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు, నాలుగు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలు వారికి ఉన్నారు.
కాగా, చిన్న చిన్న విషయాలపై జగదీష్, రీమాబాయి తరచుగా గొడవపడేవారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఆహారం విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన జగదీష్ కర్రతో రీమాబాయిని దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావం వల్ల ఆమె అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు భార్యను హత్య చేసిన జగదీష్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఆ గదిలోనే రెండు రోజులపాటు ఉన్నాడు. భార్య మృతదేహం ఉన్న మంచంపైనే నిద్రించాడు. జగదీష్ తండ్రి ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఇంటికి చేరుకున్నారు. రీమాబాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడు జగదీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman Helped Lover Kill Husband | ప్రియుడి సహాయంతో భర్తను చంపించిన భార్య.. ముగ్గురు అరెస్ట్
Tempo Falls Into Gorge | లోయలో పడిన టెంపో.. నలుగురు పర్యాటకులు మృతి, 14 మందికి గాయాలు
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?